Four-year-old Dies : గుంటూరు జిల్లాలో బెలూన్ గొంతులో ఇరుక్కొని నాలుగేళ్ల చిన్నారి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు జిల్లా పెదకాకానిలో బెలూన్ గొంతులో ఇరుక్కోని నాలుగేళ్ల చిన్నారి శిరీష మృతి చెందింది. బుధవారం ఉదయం చిన్నారి బెలూన్ ఊదుతూ ఆడుకుంటుండగా, అది ఒక్కసారిగా గొంతులో అడ్డుపడింది.

దీంతో ఊపిరాడక బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు, ఆసుపత్రికి చేరేలోపే శిరీష మృతి చెందిందని నిర్ధారించారు•

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Four-year-old dies after balloon gets stuck in throat

You cannot copy content of this page

Scroll to Top