ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 11 at 19.55.46

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా గుడివాడ

టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

చంద్రబాబు నాయుడుపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బిజెపితో పొత్తు.

అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు, తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకే పొత్తు డ్రామా.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉన్న చంద్రబాబు,….

సిగ్గు శారం లేకుండా మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులుపడి….. అమిత్ షా……మోడీ అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్న ఘనుడు చంద్రబాబు

అధికారం కోసం ఎన్ని మోసాలు అయినా చేస్తాడు….
ఎంతమంది బూట్లయినా నాకుతాడు.

అధికారంలో ఉన్నప్పుడు నల్ల చొక్కా వేసుకొని….. బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన వ్యక్తి చంద్రబాబు.

బార్య,పిల్లలు లేని మోడీ దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని…
బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన వ్యక్తి చంద్రబాబు.

మళ్లీ ఇప్పుడు నరేంద్ర మోడీ గొప్పవాడు…. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నానంటున్నాడు

అధికారంలో రావడానికి ఎలాంటి అబద్ధాలు చెప్పడానికైనా చంద్రబాబు వెనకాడడు

రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేసి, బిజెపి మతతత్వ పార్టీ అన్న చంద్రబాబు…. ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాడు.

వెయ్యి మంది మోడీలు, లక్ష మంది చంద్రబాబులు, కోటి మంది పవన్ కళ్యాన్ లు కలిస్తే ఎంత బలం ఉంటుందో….. అంతకన్నా లక్షల రెట్ల బలమున్న భగవంతుడు ఆశీస్సులు సీఎం జగన్ కు ఉన్నాయి.

You cannot copy content of this page