తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్….
Trinethram News : Hyderabad : రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారు. వారికి అభినందనలు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసును తేటతెల్లమైంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేసారు. ఇ కారు రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగాం. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగినం.
స్పీకర్ ని మొన్నే కలిసి అడిగాం. ఈరోజు సభలో అడిగాం .. మిమ్మల్ని బయటకు
పంపి సభలో చర్చ కొనసాగించారు. కేసు పెట్టవద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగాం. ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా. ఫార్ములా ఇ రేసులో 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు .. మిగతా 50శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నం అని సదరు సంస్థ చెప్పింది.
45లక్షల పాండ్స్ అంటే సుమారు 47 కోట్లు. కాని రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పిండు. వాస్తవానికి 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగింది. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది. ఫార్ములా ఇ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్ కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది. రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్దం. రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ తీసిండు రేవంత్ రెడ్డి.
అసలు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు. అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది. రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు. ఇందులో అవినీతి ఏముంది. ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినయి కావొచ్చు, అవినీతి లేదు. పొన్నం ప్రభాకర్ గారే నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అన్నడు. వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తది.
మే బీ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ .. 2022లో ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు చూసారు. తెలంగాణ ఖ్యాతి పెరిగింది. 42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్ ప్రదేశ్ 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు, మీ కాంగ్రెస్ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ 70వేల కోట్లతో నిర్వహించారు. అదొక స్కాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే కేటీఆర్ ని అభినందించారు.
• ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ కి వేరే వారిని బదనాం చేస్తరో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయట పడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తుంటరు. అట్లా కాలం వెళ్లదీస్తుంటారు.
• ఈ సామెత ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు అతికినట్లు సరిపోతుంది.
• అలవిగాని హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టిండు.
• ముఖ్యమంత్రి అయితే అయ్యిండు గానీ, ఆయన ఇచ్చిన హామీలు ఎట్ల అమలు చెయ్యాలె అని తలుచుకొని భయంల పడ్డడు.
• ఎట్లనన్న గట్టెక్కాలె. తిమ్మిని బమ్మిని చెయ్యలె అనే ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రమే దివాళా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలు పెట్టిండు.
• రాష్ట్రం దివాల తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివాలా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడు.
• ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలు లక్షల 17వేల కోట్ల అప్పే అని శాసన సభ సాక్షిగా నోరు మూయించినం.
• గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. రాష్ట్ర పరపతి, ప్రతిష్టను దెబ్బతీసిండు.
• మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన్రు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది.
అని ఓ తత్వవేత్త అన్నడు.
• కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది.
• ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు.
• ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే చాలు అరెస్టులు
• రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు.
• ఏం చేసిండు మా కేటీఆర్.
• నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నడు.
• నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నడు.
• నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడు.
• ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ ఆర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు.
• మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చేస్తున్న లూటిఫికేషన్ ను బయటపెట్టిండు.
• ఇవన్నీ చేసిండు కాబట్టి, నీకు వశపడక. ఏదో ఒక కేసు పెట్టాలె, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపినవు.
• అరెస్టులతో లీడర్లను, క్యాడర్ ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నవు.
• కేటీఆర్ చేసిన తప్పేంది.
• ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఇ రేసును హైదరాబాదుకు తెచ్చిండు.
• గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చాలనుకున్నడు.
• అది కేటీఆర్ తప్పా?
• 2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో ఫార్ములా ఇ రేసు నిర్వహిస్తే, రాష్ట్ర జీఎస్డీపీకి రూ. 700 కోట్లు సమకూరిందని నీల్సన్ అనే ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థ చెప్పింది.
• సాధారణంగా ఇలాంటి రేసులకు సంబంధించి హోటళ్లకు 12శాతం జీఎస్టీ ఉంటది. రేసులకు 28శాతం జీఎస్టీ ఉంటది.
• సగటున తీసుకున్నా రూ. 700 కోట్లకు గాను జీఎస్టీ కింద సుమారు 20శాతం జమ అయి ఉంటది. అందులో 10శాతం నేరుగా రాష్ట్ర ఖజానాకు వస్తది. ఇంకో 10 శాతం కేంద్రం ఖజానాకు పోతది.
• అంటే రాష్ట్రం రూ. 30 కోట్లు పెట్టుబడి పెడితే రూ. 70 కోట్ల జీఎస్టీ రాష్ట్ర ఖజానాకు, మరో రూ. 70 కోట్లు కేంద్ర ఖజానాకు వెళ్లింది.
• కేంద్రానికి వెళ్లిన 70 కోట్లలో రాష్ట్రవాటా కింద 2.102 శాతం డెవల్యూషన్ కింద సుమారు కోటిన్నర రూపాయలు మళ్లీ రాష్ట్ర ఖజానాకే వస్తయి.
• అంటే కేటీఆర్ చేసింది ఏంటి. రూ. 30 కోట్లు ఖర్చు చేసి రూ. 71.50 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూర్చిండు. అది తప్పా?
• ఇదే ఈవెంట్ మూడేళ్లు నిర్వహించేందుకు గాను ప్రభుత్వంతో ఒప్పందం కుదిర్చిండు.
• ఎలక్షన్ కోడ్ వయొలేషన్ ఉంది అన్నడు. నిర్ణయం ఏడాది క్రితం అయ్యింది. ఎన్నికల కోడ్ రాకముందే అంతా జరిగింది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ కు కోడ్ ఉండదు. ఒక వేళ ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తది. ఏసీబీ కి ఏం సంబంధం.
• ఏ1 కేటీఆర్, ఏ2 అధికారి, అయితే ఆ కంపెనీ మీద ఎందుకు పెట్టలేదు.
• మొన్న సాయంత్రం 5 గంటలకు దానకిషోర్ ఫిర్యాదు చేసారు. 24 గంటలు జరగకముందే కేసు పెట్టారు. దీని వెనుక కుట్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టం.
• కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు.
• ఆ డైవర్షన్ లో భాగమే.. కేటీఆర్ మీద పెట్టిన కేసు.
• ఈ రేవంత్ రెడ్డికి అటు విజన్ (VISION) లేదు, ఇటు విజ్ డమ్ (WISDOM) లేదు.
• రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి వచ్చింది
• ఇక్కడ ఇంటర్ నేషనల్ రేసు మూడేండ్లు జరగాల్సి ఉంటే, దాన్ని మధ్యంతరంగా రద్దు చేసిండు.
• ఈ పాటి దానికి, ఈ సుద్దపూస 2036 లో హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తడట.
• కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడన్నట్లు. ఆల్రెడీ ఒప్పందం అయి మూడేళ్లు రేసు నిర్వహించే అవకాశం ఉన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ ను రద్దు చేసి, ఒలింపిక్స్ నిర్వహిస్తానని డబ్బా కొడుతున్నడు.
• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని లండన్ లో ప్రభుత్వం మీద కేసు వేసింది.
• ఆ కేసు గెలిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ మరింత తగ్గుతది.
• ఇది కేటీఆర్ గాకి సంబంధించిన అంశం కాదు, నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించినది.
• రాష్ట్ర ప్రతిష్ఠ, దేశ ప్రతిష్ఠ దిగజారింది.
• దిస్ విజన్ లెస్ చీఫ్ మినిస్టర్.. రూయిండ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్.
• అప్పులు అప్పులు అని దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రం అన్నడు.
• ఇవాళ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోయినయి. ఉద్యోగ కల్పనకు దిక్కు లేకుండా పోయింది.
• ఎవడన్నా అకల్ ఉన్నోడు నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఎల్ అండ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను లోపలేయాలని పోలీసులకు చెప్పిన అని గర్వంగా చెప్పుకుంటడా. అంతకుమించిన తలకుమాసినోడు ఎవడన్న ఉంటడా?
• ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్ అండ్ టి సంస్థకు చెందిన మెట్రో సీఈఓను లోపలేస్తా అన్నడు రేవంత్ రెడ్డి.
• కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి దివగంత దాసరి నారాయణ రావు గతంలో చంద్రబాబు పాలన ఎట్లుండెనో చెప్పేందుకు ఓ సినిమా తీసిండు.
• ఆ సినిమా పేరు ‘‘ పిచ్చోడి చేతిలో రాయి’’
• అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు, ఎవరి మీద పడుతడో, ఏం కేసులు పెడతడో తెల్వకుండా అయ్యింది.
• శుక్రవారం వచ్చిందంటే చాలు అందరూ భయపడే పరిస్థితి.
• రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్ వాడీల మీద కేసులు, ఆశాల మీద కేసులు, చివరకు ఎక్కడి పోయిందంటే.. పోలీసుల మీద కూడా కేసులు పెట్టించిండు. సినిమా వాళ్ల మీద కూడా కేసులు పెట్టించిండు.
• ఆయన పాలనా వైఫల్యాలపై అడుగడుగునా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం పెద్ద విషయమా?
• కేటీఆర్ మీద కేసులు పెట్టిండు, నా మీ పెట్టిండు, తలసాని మీద పెట్టిండు, పల్లా మీద పెట్టిండు, కౌశిక్ రెడ్డి మీద పెట్టిండు… మా పట్నం నరేంద్ రెడ్డి అయితే నిన్ననే జైలు నుంచి బయటికి వచ్చిండు.
• పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్దాలతో బుకాయించు.
• ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలె, గల్లీలోనేమో రాజ్యంగ భక్షణ చెయ్యాలె.
• 125 అడుగుల అంబేద్కర్ కే తాళం వేసి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది.
• ఎండాకాలం వడ దెబ్బ తప్పించుకోవచ్చు గానీ, రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బ తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది.
• నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మా కేటీఆర్ నీ వెంటపడటం మానరు, నీ బండారం బయటపెట్టడం ఆపరు.
• ఈ పిచ్చి కేసులకు భయపడి మా లీడర్లు గానీ, క్యాడర్లు గానీ ఎక్కడా తగ్గరు.
• కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్లం. వెనుకడుగు వేసిది లేదు.
• కేసు నమోదు కాగానే ఇడి ఇన్వాల్వ్ అవుతున్నది. ఏసీబీని వివరాలు అడుతున్నదని వార్తలు చూస్తా.
• కాంగ్రెస్ బీజేపీ కుమ్మకయ్యారు. చోటే బాయ్ బడా బాయ్ బంధం భయట పడింది.
• సివిల్ సప్లైలో కుంభకోణం జరిగింది, రేవంత్ రెడ్డిపై విచారణ జరపాలని అడిగితే చేయరు.
• పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రైడ్ అయ్యంది. ఏమైందో ఎవరూ చెప్పరు.
• అమృత్ స్కాం గురించి ఢిల్లీ వెళ్లి చెప్పినా, ఎవ్వరూ స్పందించరు.
• మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.
• హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. అన్ని వర్గాల ప్రజలు గులాబీ జెండాకు జై కొట్టారు.
• సగం మంది రుణమాఫీ ఎగ్గొట్టినోడికి, రైతుబంధు ఎగ్గొట్టినోడికి, ఫీజు రీయెంబర్స్ మెంట్ ఎగ్గొట్టినోడికి, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టినోడికి, పింఛన్ల పెంపుదల ఎగ్గొట్టినోడికి, మహిళలకు 2500 ఎగ్గొట్టినోడికి, ఆడబిడ్డలకు తులం బంగారం ఎగ్గొట్టినోడికి, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినోడికి…మొత్తంగా అభయహస్తం మేనిఫెస్టోనే ఎగ్గొట్టినోడికి కేసులు పెట్టుడు తప్పం ఇంకే చాతనైతది.
• ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానుకో. రాష్ట్రం కోసం పని చేయాలని కోరుతున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App