Trinethram News : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది..
ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం వచ్చిన ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారట..
ఈ తరుణంలోనే తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివా నగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..