Fibernet Case Dismissed : ఫైబర్ నెట్ కేసు కొట్టివేత…విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు

TRINETHRAM NEWS

చంద్రబాబుకు క్లీన్ చిట్…ఇతర నిందితులకూ

Trinethram News : విజయవాడ: వైసీపీ అధి కారంలో ఉండగా ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరి గిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితు లకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2014-19 నడుమ ఫైబర్నెట్ కార్పొ రేషన్ నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేష నకు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటి ల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.

నాటి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రా సాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ఉన్న తాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. కేసులో దర్యాప్తు పూర్తయినట్లు కొద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజ యవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చారు.

అయితే ఖజానాకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని. కేసును ఉపసం హరించుకుంటున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్ ఇచ్చారు.

కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నేత గౌతంరెడ్డి రంగప్రవేశం చేశారు. తీర్పు ఇచ్చే ముందు తన వాదనలను వినాలని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి విచారణార్హత లేదంటూ న్యాయా ధికారి పి.భాస్కరరావు పిటిషను గురువారం కొట్టివే శారు. ఆ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fibernet case dismissed

You cannot copy content of this page

Scroll to Top