జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 21 at 16.22.55

TRINETHRAM NEWS

Trinethram News : కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 21
కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు వేసింది. క‌ర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో భార్య, అత్తను చంపి మామను తీవ్రంగా గాయ‌ప‌రిచిన కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభా దేవి బుధవారం తీర్పు వెలువరించారు.

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రు లతో పాటు రుక్మిణి ఆమె తల్లి రమా దేవిని అతికిరా తకంగా చంపేశాడు.

రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని దారుణంగా గాయపరి చాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్ప‌ట్లో కేసు న‌మోదైంది.

విచారణలో నిందితులపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణలో కేవలం సంఘటన జరిగిన 13నెల లోపల విచారణ పూర్తి చేసి నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనా త్మకమైన తీర్పు చెప్పారు….

You cannot copy content of this page