జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 20 at 12.24.00

TRINETHRAM NEWS

Trinethram News : నిజామాబాద్ జిల్లా :మార్చి 20
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తర లించారు.

అయితే గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది మృతులను వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి (22), ముప్కాల్‌లో నివాసం ఉంటున్న ఉద్ధవ్ (45)గా గుర్తించారు.

స్పాలో మృతి చెందిన ఉద్దవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పఠాని రిషిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించ‌గా.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు బాల్కొం డ ఎస్సై గోపి తెలిపారు.

ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

You cannot copy content of this page