నేటి నుండి రైతు భరోసా డబ్బులు జమ
Trinethram News : హైదరాబాద్ : జనవరి 27
రైతు భరోసా పధకం నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాళ నుంచి వారి వారి ఖాతాల్లో నేరుగా జమ కానుంది. ఆదివారం గణతంత్ర వేడుక ల సందర్బంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతుబంధు నిలిచిపోయేది. ఇప్పుడా సమస్యల్ని సరిచేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధి కారుల వద్ద సమర్పించేం దుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ చిట్టా రెండు మూడు రోజుల్లో సిద్ధం : ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు.
ఆ విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికా రులు పోర్టల్ నుంచి తీసివేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తహసీల్దార్లు, సీసీఎల్ఏకు చెందిన జాబితాల్లోనూ ఈ వివరాలు పొందుపరుస్తు న్నారు.
కేవలం సేద్యం చేయడం లేదని మాత్రమే జాబితాలో పేర్కొంటారు కానీ పట్టా భూముల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఒకే సర్వే నంబరులో కొంత సాగుయోగ్యమైనది, మరికొంత సాగుకు యోగ్యం కాని భూమి ఉన్నప్పుడు ఆ వివరాలను తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికా రులు విభజిస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో ఈ పని పూర్తి కానున్నట్లు వారు తెలిపారు.గత సీజన్ మాదిరిగానే సాయం విడుదల: ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పు న ఏడాదికి రూ.12 వేలు భరోసా కల్పిస్తున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో మాదిరిగానే తొలి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎంకరంన్నర, రెండెకరాలు ఇలా విడతల వారీగా ‘ఈ కుబేర్’ విధానం ద్వారా ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App