పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ కి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పోలీస్ శాఖలో గత 24సం,, లుగా హోం గార్డ్ గా ఎం. డి మన్సుర్ అహ్మద్ హోం గార్డ్ నంబర్ .270, మంచిర్యాల సబ్ యూనిట్ నందు విధులు నిర్వహించడం జరిగింది. ఇట్టి హోంగార్డ్ ఈ రోజు పదవి విరమణ పొందుతున్న సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఐపీఎస్ (ఐజీ) కమీషనర్ కార్యాలయంలో పూలమాల వేసి, శాలువా తో సత్కరించి జ్ఞాపిక ను అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మంచిర్యాల జోన్ హోంగార్డ్స్ ఇంచార్జ్ ఏఆర్ ఎస్ఐ బీరమ్ సింగ్, పెద్దపల్లి జోన్ హోంగార్డ్స్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top