
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని వ్యక్తపరిచారు. దానితోపాటు విద్యార్థులు తదుపరి ఉన్నత విద్యలో రాణించి ఘనమైన విజయాలను సాధించవలసిందిగా కొనియాడారు. అనంతరం విద్యార్థులు తమ హావభావాలను సంతోషంగా, భావోద్వేగంతో వ్యక్తపరిచారు. ఉపాధ్యాయులు కూడా తమ తమ సాంస్కృతిక కార్యక్రమాలతో, ఉపన్యాసాలతో, నృత్య ప్రదర్శనలతో విద్యార్థులని అలరించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, జయ రోజా రాణి మరియు పాఠశాల డీన్ శ్యాంసుందర్, సి బ్యాచ్ ఇంచార్జ్ కిరణ్, సతీష్ మరియు ఇన్చార్జులు స్రవంతి, తస్లీమ్, వీరితోపాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
