
Protect Indian Constitution : కూకట్పల్లి నవంబర్ 26 త్రినేత్రం న్యూస్ : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (టి డబ్ల్యూ జే ఎఫ్ ) అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచయిత, చైర్మన్, భారతరత్న, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించి, విధులను గుర్తు చేస్తూ ప్రజలకు ప్రతిఫలాలు అందించాలని ఉద్దేశంతో ఆరోజు అధికారంలో ఉన్న వారికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రావు, సామాజిక కార్యకర్త సాయి పంతుల, స్థానిక విలేఖరి బాన్సువాడ వెంకటేష్, స్థానికులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe