నవంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Kalvakuntla Harish

Kalvakuntla Harish : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు 26(త్రినేత్రం న్యూస్ ):-చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, 45 కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు కల్వకుంట్ల హరిష్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ ఆయనను మై భారత్ యూత్ ఐకాన్‌గా నామినేట్ చేసినట్లు ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందింది.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడం, దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో పనిచేస్తున్న మై భారత్ సంస్థ నుంచి ఈ గుర్తింపు లభించడం పట్ల హరిష్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల హరిష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు, మై భారత్ సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై మరింత బాధ్యతను పెంచిందని, యువత సాధికారత, విద్య, ఆరోగ్యం, ఓటరు అవగాహన, పర్యావరణ పరిరక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, సామాజిక సేవ వంటి రంగాల్లో మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

అలాగే, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడంతో పాటు, వికసిత భారత్ – 2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతం నుంచి ప్రారంభమైన తన ప్రయాణానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయానికి సహకరించిన కుటుంబ సభ్యులు, గురువులు, మార్గదర్శకులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల హరిష్‌కు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, యువత, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page