Everyone should be aware of population control methods
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్
పెద్దపల్లి, జూలై -11: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జనాభా నియంత్రణ పద్దతులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ అన్నారు.
గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయ్యప్ప టెంపుల్ మీదుగా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ,కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత వైద్యాధికారులకు సూచించారు. అంతర అనే ఇంజెక్షన్ మహిళలు తీసుకుంటే 3 నెలల వరకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఈ ఇంజక్షన్లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు వీటిని వినియోగించుకోవాలని డీఎంహెచ్ఓ తెలిపారు.
పిల్లలు పుట్టకుండా మగవారికి ఎన్.ఎస్.వి. ఆపరేషన్లను ఎన్టిపిసి ధన్వంత్రి ఆసుపత్రి ద్వారా మన జిల్లాలో నిర్వహిస్తున్నామని, ఆడవాళ్లకు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా నిరోద్ , ఐ పిల్ వాడకం పద్ధతులు ఉన్నాయని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎడిపిహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న, ప్రోగ్రాం అధికారి వి.వాణి వైద్యాధికారులు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, ఎం.ఎల్.హెచ్.పి లు డాక్టర్ అభినయ్, డాక్టర్ కీర్తన, స్టాటిస్టికల్ అధికారి సాలమ్మ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎంపిహెచ్ఓ టి.రాజేశం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App