కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు..
ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా?. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు.. ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైంది. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
వీటితో పాటే.. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయని తెలుస్తోంది. ఏప్రిల్‌లో జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని.. ఢిల్లీ సీఈఓ ఏపీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే.. ఓటర్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఏపీలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్‍లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ప్రిపరేషన్స్ ప్రారంభించింది.. సీఈసీ. ఎన్నికల నిర్వహణకు అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేస్తుంది. ఇందులో భాగంగానే.. ఏపీలోనూ ఇటీవల మూడ్రోజులు పర్యటించారు అధికారులు.
అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. పోలీసులు, కలెక్టర్లతో సమావేశాలు జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచే ఏపీలో ఎన్నికల సన్నద్దతపై సమీక్షిస్తున్నారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ గానీ.. మార్చి మొదటి వారంలో గానీ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో.. ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేశారు ఏపీ అధికారులు. ఏపీలో ఇప్పటికే రాజకీయం హీటెక్కింది. అధికార, విపక్షాలన్నీ ఫైనల్ బ్యాటిల్‌కు సిద్ధమయ్యాయి. ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి.