WhatsApp Image 2024 05 27 at 16.22.59 2
Election Commission of India Chief Election Commissioner Rajeev Kumar
సకల ఏర్పాట్లు పూర్తిచేసి కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
పెద్దపల్లి మే 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు
సోమవారం న్యూ ఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
ఎన్నికల కమిషనర్లు గ్యనేష్ కుమార్, డాక్టర్ సుక్ భీర్ సింగ్ సందు లతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు
భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెలువడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హల్ కు ఈవీఎం యంత్రాల తరలింపుకు అవసరమైన మేర సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు
ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే ప్రతి సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులపై సంపూర్ణ శిక్షణ అందించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలని, వివిప్యాట్ లెక్కింపు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు
ప్రతి కౌంటింగ్ హాల్లో అవసరమైన మేర కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి టేబుల్ వద్ద ప్రత్యేక బృందాలను నియమించాలని అన్నారు కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, కౌంటింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు
ఈ వీడియో సమావేశంలో డి.టి. ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
