జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Drunk driving dangerous

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 8కేసులు నమోదు

రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే జైలు శిక్ష కాయం

Drunk Driving Dangerous : త్రినేత్రం న్యూస్ : గద్వాల్ టౌన్:-మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని గద్వాల ట్రాఫిక్ సీఐ విద్యాసాగర్ అన్నారు. పట్టణం పట్టణంలోని డ్యామ్ ప్రధాన రహదారి పై ఆదివారం ప్రత్యేకంగా ట్రాఫిక్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంల వాహనాలు నిలిపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన 8 మందిపై ట్రాఫిక్ సీఐ కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, మద్యం సేవించి వాహనం నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురి వ్యక్తులకు రోడ్డు భద్రతా నియమాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి, రోడ్డు భద్రతా నియమాలను తెలియజేసారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకసారి దొరికితే జరిమానా మరోసారి దొరికితే జైలు శిక్షతో పాటు భారీ భారీ జరిమానా విధించడం జరుగుతుంది అని ట్రాఫిక్ సీఐ తెలియజేసారు.వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, వాహనదారులు, ప్రయాణికులు మద్యం సేవించి ప్రయాణం చేయరాదని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయాలన్నారు. నిబ్బందులను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనాలను నడుపవద్దని సూచించారు. పలువురు వాహనదారులకు చాలన్లు విధించారు.పెండింగ్ లో ఉన్న చాలాన్లను చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page