
కౌన్సిల్ లో నిధులు మంజూరు…
మండపేట: త్రినేత్రం న్యూస్.. మండపేట 20 వార్డు టిడ్కో ఇళ్లలో నివాసముంటున్న ప్రజలకు పైపులైన్ల ద్వారా త్రాగునీరు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి అన్నారు.
గురువారం ఆమె టీడ్కో గృహాల వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా టిడ్కో గృహలలో నివాసముంటున్న ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు ఆమె వివరించారు.
ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు గా 9 బ్లాకులలో ప్రతి ఫ్లోర్ కు పైపులైన్లు ద్వారా మంచినీరు అందించడానికి మున్సిపల్ సాధారణ నిధులు 4.15లక్షల రూపాయలు కౌన్సిల్ లో మంజూరు చేశామని తెలియజేసారు.
తరువాత అన్ని బ్లాకులకు త్రాగునీరు అందిస్తామన్నారు.అనంతరం టిడ్కో గృహల వద్ద జెసిబి తో చేపట్టిన తుప్పల తొలగింపు పనులను ఆమె పరిశీలించారు.
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు, ఏ.ఈ ఆంజనేయులు,టిడ్కో ఏ.ఈ వివేక్,సి.ఎల్.టి.సి బిందు,సచివాలయ సెక్రెటరీలు, శానిటేషన్ మెస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
