ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Dr. R.S. Ranganathan Jayanti

Dr. R.S. Ranganathan Jayanti : దేవరకొండ డివిజన్ ఆగష్టు 12, త్రినేత్రం న్యూస్. మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో 12/08/2026 నాడు లైబ్రరీ విభాగం ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర పితామహులు డాక్టర్ ఆర్.ఎస్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గంధపాలకుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవిమాట్లాడుతూ కళాశాల గ్రంథాలయంలో 14 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అలాగే గ్రూప్స్,సివిల్స్, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య, అకాడమీ కోఆర్డినేటర్ సి. లింగమయ్య , గ్రంథాలయ విభాగం ఇన్చార్జ్ డా„ కె. రేణుక, మెంబెర్స్ కె.నాగరాజు, వి. యాదయ్య, ఎస్. నర్మదా దేవి, వి . వెంకటేష్, పి. కొండల్ తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page