సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Kamepalli Saidulu

Kamepalli Saidulu : దేవరకొండ డివిజన్ ఆగష్టు త్రినేత్రం న్యూస్. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఆకాష్ ఆనంద్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్న సారథ్యంలో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తాను చీఫ్ జోనల్ ఇంచార్జ్ ఈశ్వర్ రవీందర్ నాయక్ కి, నల్లగొండ పార్లమెంటరీ ఇంచార్జ్ నల్ల ప్రసాద్ కి మరియు నల్లగొండ జిల్లా అధ్యక్షులు రవి శంకర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తన పై నమ్మకం ఉంచి బహుజన సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు._
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దేవరకొండ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, నీలి జెండాను దేవరకొండ గడ్డపై ఎగరేసే విధంగా కష్టపడి పనిచేస్తానని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను. ముఖ్యంగా నియోజకవర్గం ఉన్న , విద్యార్థులు మరియు యువతతో అనుసంధానం పెంచుతూ, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక న్యాయం గురించి విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాననీ తెలిపారు. బహుజనుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నిరంతరం అన్ ప్రజల మధ్య ఉంటూ .
నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను ఒక పదవిగా కాకుండా, ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావించి నిజాయితీ, నిబద్ధతతో ముందుకు సాగుతానుఅని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page