
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 15 : అరకు వ్యాలీ మండలం మాదల పంచాయతీ పరిధిలోని దోమల జోరు రక్త కండి మోడల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమం మాదల పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. గ్రామ సచివాలయ సెక్రటరీ శైలజ మేడం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “గ్రామ సభ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు. సెక్రటరీ శైలజ మేడం మాట్లాడుతూ, “మీ సమస్యలను వినతిపత్రాల రూపంలో అందిస్తే, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం” అన్నారు.
ప్రస్తుతం మాదల పంచాయతీలో దాబుగూడ, తోట వలస మధ్య క్వార్ట్జ్ మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ పంచాయతీ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ తీర్మానం సర్పంచ్ ఆధ్వర్యంలో సెక్రటరీ బుక్కులో పొందుపరిచి తాసిల్దార్ మరియు కలెక్టర్ గారికి పంపనున్నారు.
సరూబెడ్డ సెగ్మెంట్ పీసా ఉపాధ్యక్షులు టీ. అప్పారావు మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే మైనింగ్ తవ్వకాలకు పీసా చట్టం వ్యతిరేకంగా ఉన్నందున ఎవరైనా దాన్ని చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.
సిపిఎం నేతలు పి. రామన్న, కె. రమేష్, కె. అప్పన్న, కె. గోపాల్‌లు మాట్లాడుతూ, 2019 నుండి గిరిజనుల భూములను లక్ష్యంగా చేసుకుని మైనింగ్ మాఫియా దొంగతనంగా సర్వేలు చేసి మైనింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ కొండల్లో దొంగతనంగా సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు.
చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా ఈ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మైనింగ్ మాఫియాకు హెచ్చరిక జారీ చేశారు. “అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం గిరిజన హక్కులు అమలులో ఉన్నాయి, వాటిని కాపాడడం అందరికి బాధ్యత” అని గ్రామస్థులు పేర్కొన్నారు.
పాల్గొన్నవారిలో సచివాలయ సిబ్బంది, DA వార్డ్ నెంబర్లు, హెల్త్ అసిస్టెంట్లు, గ్రామస్థులు పి. రాము, టి. రామూర్తి, టి. అప్పారావు, ఎస్. గురుమూర్తి తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
