త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..*
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమమిడి గ్రామ పంచాయతి లో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన గ్రామ పంచాయతి అధ్యక్షులు అనంతుల సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.. అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు..
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాటి వీరభద్రం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కోండ్రు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తమ్మిశెట్టి శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య అశోక్ చావా ప్రశాంత్ గ్రామ పంచాయతి మహిళలు గొడ్డేటి లక్మి ,బచ్చల బాలమ్మ, గుగులోత్ జ్యోతి, ఉపాధి హామీ మెట్ మాలోత్ రవీందర్ గ్రామ పంచాయతి ఆశ వర్కర్స్ గ్రామ పంచాయతి ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


