విద్యుత్ ఛార్జీలు పెంచి… మరో భారం మోపొద్దు.
ప్రకాశం జిల్లా మార్కాపురం.
ప్రభుత్వానికి వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హితవు
ఇప్పటికే నిత్యసవర వస్తువు ధరల పెరుగుదలతో జీవనం అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్న సామాన్యుడిపై విద్యుత్ ఛార్జీల పెంచి కుంగదీయవద్దని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ సూచించారు. విద్యుత్ ఛార్జీలను పెంచిన కూటమి ప్రభుత్వం పెద ప్రజలపై భారం వేసేందుకు సిద్దమవుతోందని, ఇది ఏమాత్రం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. పేదలను ఆదుకొంటామని అధికారంలోకి వచ్చిన సర్కార్ ఆదుకోవాల్సింది పోయి మరింత కుంగదీసేందుకు సిద్దమవుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు అకాల వర్షాలు వంటి అనార్థాలతో జనజీవనం మరింత దుర్లభంగా మారిందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ప్రజలను ఉదారంంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత భారం మోపేలా విద్యుత్ ఛార్జీలను పెంచే దిశగా అడుగులేయడం శోచనీయమన్నారు. ఇది ముమ్మాటికి ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఆరాచక చర్యగానే చూడాల్సివస్తుందన్నారు . విద్యుత్ ఛార్జీలు పెంచే నిర్ణయం కూటమి సర్కార్ వెనక్కి తీసుకోకపోతే మాత్రం గతంలో మాధిరి విద్యుత్ ఉద్యమం కారణంగా చంద్రబాబు సర్కార్ ఎలా కూలిందో ఇపుడూ అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App