కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని రౌడి భూకబ్జా సంస్కృతిని తీసుకురావద్దు

TRINETHRAM NEWS

కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని రౌడి భూకబ్జా సంస్కృతిని తీసుకురావద్దు… మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి

Trinethram News : Krishna District : ఇసుక , మట్టితో పాటు భూ కబ్జా కూడా ప్రారంభించిన స్థానిక నాయకులు…. జగ్గిరెడ్డి

రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మల్లిడి శ్రీనివాస రెడ్డి సైట్ ని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్లో గత నాలుగు రోజులగా ఉంటున్నారు అన్న విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఈరోజు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆ సైట్ దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ఆ రౌడీలు వేసిన టెంట్లు మరియు గ్రీన్ మ్యాట్లు అన్ని తొలగించారు.. అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్పారు.. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసు ఉన్నత అధికారులకు జరిగిన సంఘటన పై వివరించారు..

అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఈ సంస్కృతి లేదు ఈ సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా సరే వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే సూపర్ సిక్స్ అనేది ఒక బూటక అబద్ధమని అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన పన్నాగంలో భాగమే ఈ సూపర్ సిక్స్ అన్నారు.. కావున ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండలు గానే ఉంటుంది అలాగే ప్రతి పథకం పేదవాడి వరకు అందేందుకు మా పార్టీ కృషి చేస్తుంది అన్నారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top