WhatsApp Image 2024 07 04 at 18.29.57
Doddi Komuraiya’s fighting spirit is an example for all of us
పెద్దపల్లి, జూలై -04: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్లు జే.అరుణ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు.
గురువారం అదనపు కలెక్టర్ లు జే.అరుణ, జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క అని,నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని , ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అదనపు కలెక్టర్లు తెలిపారు. మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, జెడ్పిటిసి రాములు, సంఘ అధ్యక్షులు మల్లేశం, జిల్లా అధికారులు, కలెక్టరెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
