TRINETHRAM NEWS

Do not increase the registration value of the houses in the village

Trinethram News : తేది : 28/6/20214

గౌరవనీయులైన కె.పి.వివేకానంద్ కి,
ఎమ్మేల్యే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
తెలంగాణ..

ఆర్యా, తమరితో మనవి చేయడమేమనగా :
గ్రామకంఠములో ఉన్న ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని, రిజిస్ట్రేషన్ విలువ పెంచకుండా నిలుపుదల
కొరకై రిజిస్ట్రేషను శాఖ ఉన్నత అధికారులతో వారితో చర్చించి సమస్య పరిష్కారించ గలరు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు మరియు జి.హెచ్.ఎం.సి పరిధిలో వందలాది గ్రామాలు కలిసి ( గ్రేటర్ హైదరాబాదు) ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మరణించిన తాతలు తండ్రుల పేరున ఇంటి పన్నులు చెల్లిస్తున్నకాని ఆ స్ధలం లో నిర్మాణాలు చేపట్టాలంటే
1) జి.హెచ్.ఎం.సి మరియు శివారు ప్రాంతాలలో పురపాలక సంఘం వారు నిర్మాణ లకు‌ అనుమతి ఇవ్వరు.
2) తహసీల్దార్లు గ్రామకంఠ దృవీకరణ పత్రాలు మరియు ఫ్యామిలీ మెంబర్ దృవీకరణ
పత్రాలు ఇవ్వరు.
3) బ్యాంకులు ఋణాలు ఇవ్వరు.
4) రిజిస్ట్రేషన్ శాఖవారు రిజిస్ట్రేషన్ చెయ్యరు.
5) ప్రయివేటు అప్పులు తీసుకుని లేదా ఉన్న నాలుగు ఐదు గుంటల భూమి అమ్ముకుని ఇండ్లు నిర్మించుకుంటే జిహెచ్.ఎం.సి. వారు 100% ఇంటి పన్ను అధికంగా వేస్తున్నారు. కావున సంబంధిత అధికారులతో చర్చించి వందలాది గ్రామల ప్రజలకు మేలు చేయాలని గ్రామల ప్రజల తరపున కోరుచున్నాను.

గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినవారే కావున మీరందరకి ( గ్రేటర్ పరిధిలో ఉన్న MLA ) కు మా న్యాయ మైన సమస్య తెలుసు కావున పరిష్కరించ గలరు..

కార్యక్రమములో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు,
శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

✍️ తమ విధేయుడు.

కోల రవెందర్ ముదిరాజ్
సామాజిక కార్యకర్త
సెల్: 9849354039

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Do not increase the registration value of the houses in the village