TRINETHRAM NEWS

District Collector P.Arun

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్ 1వ తేదీనే 100శాతం పింఛన్లు పంపిణీ కావాలి.

పల్నాడుజిల్లా లోని పింఛనుదారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయo లో పింఛన్ల పంపిణీపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,2 తేదీల్లో మొత్తం పింఛన్లు పంపిణీ కావాలని, ఈ విషయాన్ని ప్రతి గ్రామం, వార్డులో ముందస్తు ప్రచారం చేపట్టాలని అన్నారు. పింఛను డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 5.00గం.ల నుంచి పింఛన్లు పంపిణీ కావాలని కలెక్టర్ తేల్చి చెప్పారు.అధిక శాతం పింఛనుదారులు ఒకే బ్యాంకు నుంచి పింఛను పొందడం వలన, పింఛను పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని, అటువంటి సమస్య లేకుండా తమ సమీప బ్యాంకు నుంచి లబ్ధిదారులు పింఛనును పొందేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ పంపిణీలో పాల్గొనాలి అని తేలిపారు.ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డి.ఎల్.డి.ఓ ,ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector P.Arun uBab who ordered the officials