
పెద్దపల్లి, మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న రామగుండం ప్రాంతానికి చెందిన విద్యార్థిణికు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ల్యాప్ టాప్ పంపిణీ చేశారు రామగుండం తబితా ఆశ్రమానికి చెందిన పేద విద్యార్థిణి ఎస్. శ్రీజ తన ఇంజనీరింగ్ చదువుకు ఉపయోగపడే విధంగా ల్యాప్ టాప్ అవసరం ఉందని అన్నారు.
8వ తరగతి లోనే తల్లి కోల్పోయిన ఎస్. శ్రీజ తబితా ఆశ్రమంలో ఉంటూ చదువుకొని, పదవ తరగతి లో 10 జిపిఏ, ఇంటర్ లో 983/1000 మార్కులతో ఉత్తీర్ణత సాధించానని, జ్యోతిష్ మతి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు లభించిందని, 2వ సంవత్సరం చదువు కోసం ల్యాప్ టాప్ అవసరం ఉందని కొరుతూ ఇటీవల ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా స్పందించిన జిల్లా కలెక్టర్ 40 వేల రూపాయల నూతన ల్యాప్ టాప్ ను సంబంధిత విద్యార్థినికి నేడు పంపిణీ చేశారు. రానున్న రోజులలో విద్యార్థిని చాలా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
