TRINETHRAM NEWS

జాతీయ రహదారి భూసేకరణ పూర్తి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి , నవంబర్-08: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో భూ సేకరణ అంశాల పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, వరంగల్ -మంచిర్యాల 136 జి 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెండింగ్ భూసేకరణ త్వరగా ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు. అవార్డు పాస్ చేసిన భూసేకరణ కేసులను సంబంధిత జాతీయ రహదారి అథారిటీకి అప్పగించాలని, పెండింగ్ లో ఉన్న పెమెంట్స్ యొక్క వివరాలను తెప్పించుకొని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ లను ఆదేశించారు.

అనంతరం సింగరేణి సంబంధించి పెండింగ్ ఆర్&ఆర్ సమస్యలపై రివ్యూ నిర్వహించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.

ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సింగరేణి భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సంబంధిత తహసీల్దార్ లు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App