TRINETHRAM NEWS

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, నవంబర్ -11: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అర్జీలు పరిష్కారం సత్వరమే చేయాలనీ జిల్లా కలెక్టర్ కోయ హర్ష అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ సమర్పించిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్ లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని వీటిలో రెవిన్యూ (16), ఇతర దరఖాస్తు లు (19) మొత్తం (35) స్వీకరించామని అన్నారు.

పెద్దపల్లి పట్టణం తెనుగువాడ ప్రాంతానికి చెందిన ఈర్ల రమ తనకు ఈర్ల సాగర్ కు వివాహం జరిగిందని , తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కొడుకు కావాలని భర్త, అత్త నిత్యం వేదించేవారని, తనను కాపాడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారి కు రాస్తూ సఖీ కేంద్రం ద్వారా పరిష్కారించాలని కలెక్టర్ సూచించారు.

మంథని మండలం సూర్య పల్లి గ్రామానికి చెందిన సురేష్ వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ అవకాసం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారిది సొసైటీ కు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన వీరారెడ్డి తనకు కంటి చూపు లేదని, సదరం క్యాంప్ నుంచి 100% కంటి చూపు లేనట్లు సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

మంథని మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన సుంకరి హరీష్ రెడ్డి మంథని పరిధిలోని డి 83 కెనాల్ క్రింద గల ఎల్8 నుంచి వెళ్లే కాలువను పూర్తిగా కబ్జా చేయడం జరిగిందని, దీని వల్ల 500 మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఈ నీటిపారుదల శాఖ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App