TRINETHRAM NEWS

District Collector Koya Harsha launched Sand Taxi in Vilochavaram on 5th July

పెద్దపల్లి, జూలై-04: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూలై 5న ఉదయం 7 గంటల నుంచి ఆన్లైన్ స్యాండ్ ట్యాక్సీ ఇసుక విధానాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మంథని మండలం విలోచవరం గ్రామంలోని ఇసుక రీచ్ నుంచి స్యాండ్ టాక్సీ విధానాన్ని మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రారంభిస్తున్నామని, మంథని పరిధిలో ఇసుక అవసరమున్న వినియోగదారులు ఆన్ లైన్ మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని, ఒకరోజు లోపల ఇసుక అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మంథనిలో ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి వీలులేదని స్యాండ్ ట్యాక్సి ద్వారా మాత్రమే ఇసుక పొందాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha launched Sand Taxi in Vilochavaram on 5th July