TRINETHRAM NEWS

గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!!
రోటరీ క్లబ్ సేవల పై హర్షం వ్యక్తం చెసిన గిరిజన నాయకులు.

అల్లూరి సీతారామరాజు.జిల్లా త్రినేత్రం న్యూస్. జనవరి 22.

అనంతగిరి మండలం కాశీపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో రోటరీ క్లబ్ వారి సారద్యంలో సభ అధ్యక్షులు నరాజి. మల్లేశ్వర రావు, ద్వారగా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ సెక్రటరీ మణిమాల,ప్రెసిడెంట్ గాంధీ ఆధ్వర్యంలో గనంగా. జరిగిందీ. ముఖ్య అతిథులుగా. అనంతగిరి మండల జడ్పిటిసి దీసరి గంగరాజు, అనంతగిరి మండల విద్యాశాఖ అధికారి కిల్లో బాలాజీ, స్థానిక ఎంపీటీసీ *మూతి బోయిన సన్యాసిరావు *
అనంతగిరి సూపర్ సర్పంచ్ సోమెల నాగులు,కె చిన్నమ్మి బి విజయ, రోటరీ క్లబ్ సభ్యుల చేతులు మీదుగా అందిచడం జరిగింది.ముఖ్య అతిది జడ్పిటిసి,దీసరి గంగరాజు మాట్లాడుతూ. గిరిజన ప్రాంతంలో దాతృత్వం కలిగి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న మీరు… మారుమూల గిరిజన ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరచాలని, అలాగే ప్రజా ప్రతినిధులుగా మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుందని సందర్భంగా తెలియజేశారు.
ఎంపీటీసీ మూతి బోయిన సన్యాసి రావు మాట్లాడుతు.రోటరీ క్లబ్ఆధ్వర్యంలో సేవలు ముఖ్యంగా గిరిజనులకు అందడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఆని,రోటారి క్లబ్ ఆద్వర్యంలో అమలు ఆ సేవలు సర్వత్ర హర్శం వ్యక్తం అవ్తుంది. రోటరీ సేవలు మున్ముందు మరిన్ని కార్యక్రమాలతొ ఆదర్శంగా నిలవాలని ఎంపీటీసీ రోటరీ క్లబ్ సేవాలని కొనియాడారు.
రోటరీ క్లబ్ సెక్రటరీ మణిమాల మాట్లాడుతూ… గిరిజన ప్రాంతంలో సేవ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగి చేస్తుందని.. అలాగే… గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు సేవలు అందించడానికి ఎప్పుడు ముందుంటామని సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లుంగపార్తి గిరిజన సంఘం నాయకులు ** తొమ్మిది పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App