Distribution of Rice : విశ్వోదయ సేవా సమితి ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసరాలు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లా :కావలి… విద్యాదాత డి.ఆర్ చన్నా వెంకట్రామయ్య. బియ్యం, నిత్యావసరాలు పంపిణీ.. డి.ఆర్ విశ్వోదయ సేవా సమితి ఆధ్వర్యంలో కావలి వెంగళరావు నగర్ లోని  తమ కార్యాలయంలో డి.ఆర్ పేరు మీద 60 మంది నిరుపేద వృధ్ధులకు 70 వేలు విలువ చేసే 10కేజీలు బియ్యం, వంటింటి సరుకులు,రొక్కం 60 రూపాయలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చవేరా ఫర్నిచర్ ఫ్యాక్టరీ అధినేత చెన్నా వెంకట్రామయ్య, చన్నా రమాదేవి దంపతులు, కుమారుడు చెన్నా స్వామినాధ్ పాల్గొన్నారు.
చన్నా వెంకట్రామయ్య మాట్లాడుతూ డి.ఆర్ గొప్ప మానవతావాది అని,విద్యాదాత అని, వారు సమాజానికి చేసిన సేవలు అమూల్యమని అన్నారు. డి.ఆర్ మార్గంలో కళాశాలలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వినయకుమర్ రెడ్డి, విద్యాధర కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెల్పారు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా విశ్వోదయ విద్యా సంస్థలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో కనిపిస్తుంటారన్నారు. ఇది కావలికి గర్వకారణం అన్నారు.
ఈకార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ వినయ కుమార్ రెడ్డి, డి.ఆర్. విశ్వోదయ సేవా సమితి డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, సేవాసమితి సభ్యులు నల్లూరు రామకృష్ణ , సతీష్ సింగ్ పాల్గొన్నారు.  

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of rice and essentials

You cannot copy content of this page

Scroll to Top