చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ జనవరి 18:
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి 7వ వార్డుకు చెందిన జపర్పల్లీ రాములు విజయ లక్మి దంపతుల రెండవ కుమార్తె జాపర్పల్లి చైత్ర ప్రిన్సీ బర్త్ డే సందర్భంగా గ్రామంలోని హై స్కూల్ లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులను అందించారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ గోపాల్, మాట్లాడుతూ మానవ జీవితంలో విద్య అనేది ఎంతో విలువైనది కావున ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అదేవిధంగా మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజ సేవకి ఉపయోగించాలని అన్నారు.
బిఆర్ఎస్ నాయకులు పడిగల్ల అశోక్, మాట్లాడుతూ రాబోయే 10వ తరగతి పరీక్ష లో అత్యధిక ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకి గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు ,7వ వార్డు కౌన్సిలర్ సంతోష నర్సింలు ,కాంగ్రెస్ నాయకులు చాకలి మల్లయ్య ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ , జి.లాలయ్య, సిచ్.అంజయ్య, జి.యాదయ్య, షాబాద్ శ్రీనివాస్,సామాజిక తెలంగాణ విలేకర్ చాకలి రాజు, జి.లక్ష్మణ్, జి.గోపాల్, జి.వెంకట్, జి.రాజు, జె.దాసు, జి.శింటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App