ఖనిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ ర్యాలీ
డయాబెటిక్ 2కె రన్ నిర్వహించిన లయన్స్ క్లబ్
వ్యాయామంతోనే డయాబెటిక్ ని నిర్మూలించవచ్చు ఏసిపి రమేష్
డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖనిలో గురువారం 2కె రన్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోదావరిఖని ఏసిపి మడత రమేష్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, డయాబెటిక్ ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామము, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని తగిన మందులు వాడటం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు.అలాగే ఉచిత షుగర్ టెస్టులు, 410వ రోజు ఆల్పాహారణ వితరణ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి, రామగుండం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, జోన్ చైర్మన్ కె రాజేందర్, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, తానిపర్తి గోపాల్ రావు, గుండ వీరేషం,డి లక్ష్మారెడ్డి, కోలేటి శ్రీనివాస్, ముడతనపల్లి సారయ్య, గుండ రాజు, డాక్టర్ గోపికాంత్, మగువ: డాక్టర్ లక్ష్మివాణి, శశికళ, గోదావరిఖని స్ఫూర్తి: జయ ప్రకాష్ చావ్డా, నరేష్, వినోద్ , శతాబ్ది: రాజేశ్వర్ రావు, చంద్రమౌళి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App