TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు రోడ్డు భద్రత మాసాన్ని పురస్కరించుకొని రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, రోడ్‌ సేఫ్టీ అండ్‌ రైల్వేస్‌ అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్‌ విభాగం డీఐజీ రంగనాథ్‌, రోడ్‌ సేఫ్టీ ఎస్పీ సందీప్‌తో కలిసి డీజీపీ మంగళవారం తన కార్యాలయం నుంచి కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-చలానా నిధుల ద్వారా స్పీడ్‌గన్స్‌, బ్రీత్‌ ఎనలైజర్స్‌ వంటి పరికరాలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడం, అధికవేగం, మొబైల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి కారణాలతోనే జరుగుతున్నాయని పోలీస్‌ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.