
Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ గారు మాట్లాడతూ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై స్వామి దీవెనలు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు .
