జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 12.59.28

TRINETHRAM NEWS

గుమ్మనూరు ఎమ్మెల్యే “జయరాం” బలుపు మాటలకు ఖండన

జయరాం పై సుమోటాగా కేసు నమోదు చేయాలి. మేడా శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి , జర్నలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (జె డి ఆర్ ఎఫ్ )

Trinethram News : Andhra Pradesh : గుమ్మనూరు ఎమ్మెల్యే పై వ్రాసే వార్తలు తప్పుడు కధనాలు అని నిరూపించు కోవటం చేతకాక బెదిరింపులకు దిగుతున్న ఎమ్మెల్యే జయరాం పై చర్యలు తీసుకోవాలని జె డి ఆర్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ కోరారు .

వార్తలు వ్రాసే టప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలని, అలా కాదని వార్తలు రాస్తే తాట తీస్తానంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బలుపు మాటలు మాట్లాడటం మంచి పరిణామాలు కాదన్నారు . జర్నలిస్ట్ ల పనే వార్తలు వ్రాయటం, వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలియచేయటం అని జయరాం మరువటం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని ,
తప్పుడు వార్తలు వ్రాసి నటైతే న్యాయ పరంగా సమాధానం ఇవ్వాలని, అలా కాకుండా తనకు వ్యతిరేకంగా వార్తలు వ్రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా నంటు బెదిరించటం చూస్తుంటే విలేకరుల వ్రాసిన వార్తలు జయరాం ను భయపెడుతునట్టు కనపడుతుంది. వార్త కదనంలో పచ్చి నిజాలు దాగి ఉన్నట్టు అర్ధమైతుంది . పైగా జయరాం గతంలో ఎంతో మందిని పట్టాల పై పడుకోబెట్టిన చరిత్ర తన సొంతం అన్నట్టుగా విలేఖరులను బెదిరించే ధోరణిలో జయరాం హెచ్చిరిక సాంఘ విద్రోహ చర్యగా బావించాలి .

జర్నలిస్ట్స్ లను బెదిరించటం ఆటవిక పాలనను తలపిస్తుందని , వార్తలో తప్పు ఉంటే నిరూపించుకోవాలని , అలా కాకుండా నేను తోపును అంటు బలుపు మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చూస్తు కూర్చోదని , జయరాం వంటి వారికి గుణపాఠం చెప్పటానికి యావత్ జర్నలిస్ట్ సోదరులు అందరు ఒక వేదిక మీదకు రావాలని , జర్నలిస్ట్ లకు ఏ బలహీనతలు లేవని , ప్రజా హితం ఒక్కటే నని నిరూపిద్దాం. జయరాం పై చర్యలు తీసుకోక పొతే న్యాయపరంగా బుద్ది చెబుతామని ఆయన హెచ్చిరించారు ..

జయరాం విలేఖరులను బెందిరించిన ఘటన గతంలో చాలా మందిని తను రైలు పట్టాలపై పడుకోబెట్టి నట్టు అంగీకరించినట్టు ఎమ్మెల్యే స్వీయ వాంఘ్ములం పైన సుమోటో గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని , విలేఖరులను బెదిరించిన ఘటనపై బే షరతుగా జయరాం క్షమాపణ చెప్పాలని , జయరాం పై చంద్రబాబు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జె డి ఆర్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ కోరారు .

మేడా శ్రీనివాస్ ,
ప్రధాన కార్యదర్శి ,
జర్నలిస్ట్స్ డెమక్రాటిక్ రైట్స్ ఫోరం (జె డి ఆర్ ఫ్ )

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page