
Case Solved : త్రినేత్రం న్యూస్ : నాగర్ కర్నూల్ తిమ్మాజిపేట పీఎస్ పరిధిలో పట్టపగలు హౌస్ బ్రేకింగ్ కేసు ఛేదన. గోరిట గ్రామంలో జరిగిన బంగారు నగల చోరీ కేసును పోలీసులు చేధించారు.ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన నాగర్‌కర్నూల్ పోలీసులు. నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా 20–25 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడి.
2016 నుంచి వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితులు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పట్టపగలు చోరీలకు పాల్పడిన ముఠా.ఒకరు ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇద్దరు బయట కాపలా కాసే విధంగా చోరీలు.గోరిటలో రూ. విలువైన బంగారు నగలు అపహరించిన నిందితులు.వనపట్ల గ్రామంలో జరిగిన మరో చోరీ కేసు కూడా వెలుగులోకి.
మే 30, 2026న ఇద్దరు నిందితులు బంగారు వస్తువులు అమ్ముతుండగా అరెస్ట్.జూలై 8, 2026న ప్రధాన నిందితుడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుబాటు. నిందితుల వద్ద నుంచి 13 తులాల బంగారం స్వాధీనం. మరో కేసులో 6 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు రికవరీ. స్వాధీనం చేసుకున్న నగలను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం.
నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలింపు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచన.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. కేసును ఛేదించిన సీఐ వై. అశోక్ రెడ్డి, ఎస్‌ఐలు గోవర్ధన్, ఎం. రమేష్,పి. శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని ఎస్‌డీపీఓ అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe