TRINETHRAM NEWS

Trinethram News : Mar 17, 2024,

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం
కలుపు మందులు కలుపును చంపడమే కాకుండా భూమిలో పంటకు మేలు చేసే జీవరాసిని పూర్తిగా అంతం చేస్తాయి. ఫలితంగా నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందక రసాయన కాలుష్యానికి గురవుతాయి. అలాగే భూములు సాగుకు పనికి రాకుండపోతాయి. ఇష్టానుసారం కలుపు మందులు వాడటం వలన పంటలు, సాగు, తాగు నీటి వనరులు, నేల సారవంతం దెబ్బతింటాయి. దీంతో సాగు భూమి నిర్జీవమై రైతుల భవిష్యత్తు అంధకారమైపోతుంది.