
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ 25 వ రజతోత్సవ భారీ బహిరంగ సభ కోసం దళిత బంధు లబ్ధిదారులు తమ సొంత డబ్బులు పార్టీకి 2 లక్షలు విరాళం జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కెసిఆర్ రే మళ్లీ సియం గా రావాలని స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సకల వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు. దళితులు జీవితాల్లో వెలుగులు దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా దళితబంధు పధకం అమలు చేసిన ఘనత తొలి సిఎం కేసీఆర్ గారిదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్, నాయకులు నీరటీ శ్రీనివాస్.చింటూ,శ్రవణ్,కొర్రీ ఓదెలు.కోడి రామకృష్ణ.అయిత నాగరాజు.రొడ్డ లక్ష్మి. శాంతలక్ష్మి. హరికృష్ణ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
