DA ఫర్నిచర్ వరల్డ్ షో రూమ్ ను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన DA ఫర్నిచర్ వరల్డ్ షో రూమ్ ను మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, ప్రోప్రైటర్ సాయిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ లు తెలంగాణవ్యాప్తంగా8ఉండగా,వికారాబాద్ లో నేడు ప్రారంభించుకున్నది 9వ ఫర్నిచర్ షోరూమ్ అని నిర్వాహకులు వెల్లడించారు. ఇంట్లోకి కావలసిన అన్ని రకాల ఫర్నిచర్స్ అందుబాటులో ఉన్నాయని, ఇది వికారాబాద్ పట్టణంలోనే అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, కిసాన్ సేల్ అధ్యక్షుడు రత్నారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్,అనంతరెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, దీపు, సర్పరాజ్,ముంతాజ్, ముస్తఫా, శేషగిరి, అన్వర్, టిప్పు,రాఘవేందర్, షోరూమ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App