Awareness Seminar : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో సైబర్ నేరాల అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 06 త్రినేత్రం న్యూస్. సైబర్ నేరాల గురించి డిండి పోలీసులు సాంఘిక సంక్షేమ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు సైబర్ నేరాల గురించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలగురించి వివరించారు. సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో క్లుప్తంగా వివరించారు.
మొబైల్ ద్వారా 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక ను ఆసరాగా తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు అవగాహన పెంచుకొని ఇటువంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyber Crime Awareness Seminar at Gurukul School.

You cannot copy content of this page

Scroll to Top