TRINETHRAM NEWS

జిల్లా సమగ్రాభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి, ( సిపిఎం) నూతన జిల్లా కమిటీ ఎన్నికను ప్రకటించిన జిల్లా కార్యదర్శి – పి.అప్పలనరస

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ – పాడేరు.

జిల్లా సమగ్రాభివృద్ధికి రూ. పదివేల కోట్లు కేటాయించాలి.
నూతన జిల్లా కమిటీ ఎన్నికను ప్రకటించిన నూతన పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస.

అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ మహాసభ డిశంబర్ నాలుగున బహిరంగ సభ, ఐదు న ప్రతినిధుల సభ దిగ్విజయమైనసందర్భంగా, పాడేరు సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎల్.సుందరరావు, పి. లక్కు, వంతాల దాస్ తో కలిసి నూతనంగా ఎన్నికైన పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికిప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, గిరిజన హక్కులు, చట్టాలు అమలుపై జిల్లాపరిషత్ సమావేశం పాడేరు కేంద్రంగా నిర్వహించాలని,రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యదర్శి ప్రవేశ పట్టిన నివేదికపై ఇరవై మంది మండల, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు చర్చలో పాల్గొన్నారు. మహాసభల్లో ఇరవై అంశాలపై తీర్మానం ప్రవేశ పెట్టగా ప్రతినిధుల సభ ఆమోదించింది. వచ్చే మూడు సంవత్సరాల కాలం వరకు ఈ నూతన జిల్లా కమిటీ పనిచేస్తుందని,ఎన్నికైన నూతన జిల్లా కమిటీసభ్యుల వివరాలు క్రింద ప్రకటించారు. నూతన జిల్లా కార్యదర్శిగా పి. అప్పలనర్స,మరియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఏడు మంది మరియు పన్నెండు మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
కిల్లో సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, డి. గంగరాజు, .బి.సిహెచ్ పడాల్, ఎస్బి పోతురాజు కె.త్రినాద్.
జిల్లా కమిటీ సభ్యులు
బి. సన్నిబాబు, వి.వి.జయ ఎస్. హైమావతి, ఎల్.సుందరరావు, కె. రామారావు, కె. బుజ్జిబాబు, ఎస్.సూరిబాబు, వి. మహేష తోపాటు
నూతనంగా ఎన్నుకోబడిన వారుకిల్లో మోస్య, పాలికి లక్కు,వంతాల దాస్, పి. కుమారి.

అల్లూరి సీతారామరాజు జిల్లా నూతనంగా ఏర్పడి సుమారు మూడు సంవత్సరాలైన నేటికి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నాయో.ప్రజలుకు తెలియని దుస్థితి ఏర్పడింది. జిల్లా పరిపాలన వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేకమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. జిల్లా సమగ్రాభివృద్ధికికేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పది వేల కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సిపిఎం పార్టీ అల్లూరి జిల్లా ప్రథమ మహాసభఏకగ్రీవంగా తీర్మానం చేసింది.మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నేటికి దర్శనలిస్తున్న డోలీమోతలు నివారణకు రహదారి, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలుమెరుగుపచ్చాలి. స్థానిక ఆదివాసీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి కల్పించాలి. జి. ఓ నెం. 3 రద్దుకావడంతో , నిరుద్యోగుల తీవ్రంగా పెరిగింది. షెడ్యూల్డ్ ఏరియా, స్థానిక ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అదివాసీ మాతృభాష వాలంటీర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని,కాఫీ రైతుల బకాయి సొమ్ము రూ.62 కోట్లు, పార్స్మెంట్ కాఫీ కేజీ రూ.500/-లు, చెర్రీ కేజీ రూ.300/-లు, కాఫీ పళ్లు కేజీ 100/-లుకేటాయించాలని, పివిటిజీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, అర్హులైన ఆదివాసీలకు ఐదు లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మించాలని, పీసా కమిటీ, అటవీ హక్కుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించి ఆదివాసీ గ్రామసభలకుఅధికారం కల్పించాలని, అనంతగిరి నాన్ షెడ్యూల్డ్ ఏరియాను ఐద వ షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని, ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా అనుమతించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి సంతల్లో మోసాలు అరికట్టాలని, 1/70చట్టాన్ని పకడ్బందిగా అమలు,రెండు వందలరోజులు ఉపాధి హామీ పనులు కల్పించాలని, కార్మికులకుకనీస వేతనం కల్పించి రెగ్యులర్ చేయాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న హింసఅరికట్టాలి. మద్యం, మత్తు నివారించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్నిఅనుసంధానం చేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, అటవీహక్కులచట్టాన్ని పటిష్టంగా అమలు చేసి పోడు పట్టాలివ్వాలని, అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులగా అభివృద్ధి చేయాలని, రాష్ట్ర ట్రైబల్ యూనివర్శిటీ, హర్టికల్చర్ యూనివర్శిటీ, ఇంజనీరింగ్, బిఇడి కళాశాలు ఏర్పాటు చేయాలని, పాడేరు జనరల్ ఆసుపత్రిని కనీస సౌకర్యాలు కల్పించాలని, మండల కేంద్రాల్లో ఐటిడిఏ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి తక్కువ ధరకే ఆదివాసీ యువతకుఇవ్వాలని, గంజాయి నివారణకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగం, అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని మహాసభల్లో ప్రవేశ పెట్టినతీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App