CPM : మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి సిపిఎం డిమాండ్

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్,అల్లూరిజిల్లా, అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 17: సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాచిపెంట అప్పలనరస మాట్లాడుతూ, ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా లో ఆదివాసి గిరిజనులు యువతి యువకులకు ఉపాధి లేక నిరుద్యోగులుగా అప్పులు చేసి డీఎస్సీ కోచింగ్ సెంటర్ లలో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఆదివాసి గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం ఆదివాసి ప్రాంతంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఆదివాసి గిరిజన యువతీ యువకులకు ఉపాధి లేకుండా చేయడానికి కుట్ర చేస్తుంది. గిరిజన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధితో పాటు సహజ సంపదలు కుల్లగొట్టడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది.
అధికారంలో రాకముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులో ఎన్నికల ప్రచార సభలో జివో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు 100% ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో నెంబర్ 3 చట్టబద్ధత కోసం కానీ గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కానీ ఎటువంటి చొరవ తీసుకోకుండా ఆదివాసి గిరిజన యువతి యువకులకు తీవ్రంగా మోసం చేయడానికి కుట్ర చేస్తుంది. మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి స్పెషల్ డిఎస్సి ప్రకటన చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొద్దు బలదేవ్, జన్ని భగత్ రామ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM demands release of

You cannot copy content of this page

Scroll to Top