Accident : గోమాత (ఆవు)కు తృటిలో తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 21 :నెల్లూరు జిల్లా: కావలి : ఒంగోలు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం గోమాత( ఆవు) ను డీ గోకొట్టడం జరిగింది,వెంటనే స్థానికులు స్పందించి హెల్పింగ్ హాండ్స్ సభ్యులు వి .ఎం .ఎన్ .ఆర్మాలికి, హ్యూమన్ రైట్స్ సభ్యులు గోపి లకు తెలియపరచగా వారు వెంటనే పశు వైద్యులుని పిలిపించి వైద్యంచేసి ఆ ఆవును కాపాడడం జరిగింది.ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సభ్యులు వి ఎం ఎన్ .ఆర్ .మాలి మాట్లాడుతూ గతంలో నుండి ఇప్పటివరకు ఎంపీ రోడ్డు నందు ఆవులు రోడ్డుకి అడ్డంగా తిరుగుతూ ఉన్నాయి. ఈ ఆవులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ పాదచారులకు ఇబ్బందికరంగా మారడం,మరియు వ్యాపారస్తులు కూడా చాలా బాధపడడం చూస్తూ ఉన్నాం. వాటి యజమానులు సరిగా పట్టించుకోకపోవడం, ఆ యజమానులు కు ఎన్నిసార్లు తెలియపరిచిన లెక్క చేయని వైనం. అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది.

అధికారులు బాధ్యతారాహితంగా వ్యవహరించడం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం.రానున్న క్రిస్టమస్, సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రజలు ఎక్కువగా టౌన్ కు వస్తూ ఉంటారు వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం, అంత మాత్రమే కాదు రోడ్లు పైన అవి పనుకొని ఉన్న ఏ ఒక్కరు వాటిని రోడ్డు నుండి పక్కకు పంపించే, ప్రయత్నం చేయకుండా పోవడం చాలా బాధాకరం, దానివల్ల వాహనదారులు ఎంత ఇబ్బందికి గురి అవుతున్నారు ట్రాఫిక్ కూడా స్పందించిపోతుంది, అటు పోతున్న వారిలో ఏ ఒక్కరు వాటినే రోడ్డు నుండి పక్కకు పంపించే ప్రయోజనం చేయకుండా పోవడం, బాధాకరం నాకెందుకు నాకెందుకు అంటూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఏమి తెలియని ఆ మూగజీవులు అలా ఉండడం వలన వాహనదారులు వాటి కాలు పైన వాటి తోక పైన వాహనాలను నడిపిస్తూ ఆ ట్రాఫిక్ లో ఎటు తోచని స్థితిలో ఆ మూగజీవులు ప్రమాదాలకు గురి అవ్వడానికి మొదటి కారణం అని చెప్పవచ్చు,ఈ సందర్బంగా గోమాత రక్షించిన హెల్పింగ్ హాండ్ సభ్యులకు చుట్టుపక్కల వ్యాపార సోదరులకు, మీడియాకు తెలియపరిచే వెంటనే వచ్చి అధికారులు దృష్టి తెలియపరిచిన అమరావతి జ్యోతి న్యూస్ నాగరాజుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cow narrowly avoids accident

You cannot copy content of this page

Scroll to Top