TRINETHRAM NEWS

జగిత్యాల జిల్లా :మార్చి 16
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం హుండీల ను ఆలయ అధికారులు శనివారం విప్పి లెక్కించారు.

తేదీ 11-01-2024 నుండి 16-03-2024 వరకు మొత్తం 64 రోజులకు రూ. 31, 29, 424 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

అలాగే మిశ్రమ బంగారము 15 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 100 గ్రాములు, 50 విదేశి నోట్లు వచ్చినట్లు చెప్పారు.

ఈ లెక్కింపులో జిల్లా దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ రవికిషన్, అధికారులు పాల్గొన్నారు..