అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి : కార్పోరేటర్ ముస్తఫా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా పేర్కొన్నారు..
రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు బుధవారం 44వ డివిజన్ జవహర్ నగర్ లో ప్రజా పాలన వార్డు సభ నిర్వహించారు..
ఈ సందర్భంగా కార్పోరేటర్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సర్వేల ఆధారంగా జాబితాలో నమోదైన వారికి సంక్షేమ పథకాలు 100శాతం అందుతాయని, ఇందులో ప్రజలెవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వార్డ్ సభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం డిప్యూటీ ఇంజనీర్ చంద్రమౌళి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారు మున్సిపల్ కార్యాలయంలో మరియు మండల కార్యక్రమంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నరేష్, ఛాన్మెన్, ఆర్పీ రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి మురళి కృష్ణ, సిరిపురం మహేష్, పీక అరుణ్ కుమార్, రాపల్లి కార్తీక్, దసరపు శ్రీనివాస్, బబ్బి, బత్తుల భారత్, అవినాష్, పీక భారత్, సర్వేష్, యూసుబ్ మరియు డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App