TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వెంకటపాపయ్య నగర్లో ఎ.ఇ శ్రావణి మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వెంకటపాపయ్య నగర్ కాలనీలో కొంతమేర డ్రైనేజీ లైన్ మరియు డ్రైనేజీ లైన్ పూర్తయిన సీసీ రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు పూర్తిచేయవలసి ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో పనులు పూర్తిచేస్తామని కాలనీ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, జూపల్లి జనార్దన్ రావు, దేవేందర్ రావు, నరసింహులు, జీవన్ రెడ్డి, విక్కీ, ఎల్లయ్య, వెంకటస్వామి గౌడ్, అశోక్, వెంకట్ రెడ్డి, అంకంరావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Dodla Venkatesh Goud