
తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు మహిళల వివరాలు పొందుపర్చాం. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తాం. పేద కుటుంబాలకు అండగా ఉండాలనే ఈ పథకం రూపొందించాం’ అని ఆమె ట్వీట్ చేశారు.
