TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ సన్నబియ్యం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్.. పేదవారి కుటుంబాలను సన్నబియ్యంతో కడుపు నింపలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉగాది,రంజాన్ పర్వదినాలలో ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికి, సుమారు 3.5 కోట్ల మంది లబ్ధదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం గొప్ప సాహసోపేత నిర్ణయమని కాక రమేష్ తెలిపారు.

ఈ పథకానికి 2858 కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతున్నప్పటికీ నిరుపేద ప్రజలు అందరికీ సన్నబియ్యం అందించాలనే గొప్ప ఆలోచనతో రేవంత్ సర్కార్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది.రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 6 కిలోలు బియ్యం ప్రతినెలా అందజేయడం అదేవిధంగా నాణ్యమైన ఉప్పు,పప్పు, నిత్యావసర సరుకులు అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని కాక రమేష్ తెలిపారు.సుమారు 40 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందించనున్నది.

రైతు పండించిన సన్న బియ్యంతో, రాష్ట్ర ప్రజల కడుపు నింపాలనేదే ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా రైతుని రాజుని చేస్తూ, వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, బోనస్ రూపంలో రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలం అయిందని కాక రమేష్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడి నుండైనా లబ్దిదారులు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, సరుకులు తీసుకోవచ్చు అనే విధానం రాష్ట్ర ప్రజలకు కల్పించడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేస్తూ,సీఎం రేవంత్ రెడ్డి , కేబినేట్ మంత్రి వర్యులకు,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ధన్యవాదాలు తెలిపిన దమ్మపేట యూత్ కాంగ్రెస్ మండల కాక రమేష్.
నిరుపేద ప్రజలు అందరికీ సన్నబియ్యంతో కడుపు నింపాలనే గొప్ప సంకల్పంతో ప్రజా ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు స్ధానిక అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం అంకంపాలెం సేల్స్ మాన్ వేంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు ఈరోజు అంకంపాలెం రేషన్ షాపులో దమ్మపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్, అంకంపాలెం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వాడే వెంకటరావు ముఖ్య అతిథులుగా పాల్గొని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి,లబ్దిదారులకు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోకాళ్ల గురుమూర్తి, కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు సోయం ముత్యాలరావు, వంకా బాబుగారు, పైజుద్దీన్, యువ నాయకులు తాటి రాము,వగ్గేల పొట్టి, పొట్ట వెంకటరావు, వల్లెపు వీర్రాజు,నందిగాం గౌతం, కాక శ్రీను, కారం బాలకృష్ణ, కాక దిలీప్, సోయం చరణ్, రేషన్ కార్డు లబ్దిదారులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress government keeps its